కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ సినిమా తర్వాత వరుసగా పరాజయాలు పొందుతూ వచ్చారు. కానీ ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కుర్ర హీరోలతో సమానంగా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.  ఇటీవల పెట్టా సినిమాలో చాలా యంగ్ గా కనిపించారు రజినీకాంత్.  శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాతో మంచి విజయం అందుకున్న రజినీకాంత్ ఆ మద్య రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని తెగ హంగామా చేశారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు.  కానీ రజినీ మాత్రం ప్రస్తుతం రాజకీయాల వైపు కాకుండా మూవీలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.   ప్రస్తుతం స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for rajinikanth nayanatara
ఆయన సరసన నయనతార నటిస్తుంది.  మరో హీరోయిన్ కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ..సామాజిక కార్యకర్తగా కనిపించబోతున్నారట.  గత కొంత కాలంగా రజినీ మాఫియా తరహా సినిమాల్లో నటిస్తున్నారు.   

చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మురుగదాస్, ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడని అంటున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి తెలుగు .. తమిళభాషల్లోని మిగతా సినిమాలకి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వనుందన్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: