మెగా డాటర్ నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ మూవీ ఫెయిల్ అవ్వడంతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ అందుకున్న హీరోయిన్ గా నిహారిక మారిపోయింది. ఈసినిమా పై ఎన్నో అంచనాలు వ్యక్తిగతంగా తనకు ఉండటంతో ఈమూవీని ప్రమోట్ చేయడానికి గత రెండు వారాలుగా నిహారిక మన ఇరు రాష్ట్రాలలోని అనేక కాలేజీలకు వెళ్ళి అక్కడ తన సినిమాకు క్రేజ్ కల్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. 

అయితే ఆ ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయినా ఇంకా నిహారిక ఈసినిమా కోసం మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో ఈమె తన బాబాయ్ పవన్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడమే కాకుండా తన పై పవన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో వివరించింది. 

తనకు రాజకీయాలు పట్ల అవగాహన లేకపోయినా పవన్ ఉపన్యాసాలు తాను టీవీలలో వింటూ ఉంటే తనకు ఎంతో స్పూర్తిదాయకంగా అనిపించి తాను కూడ ‘జనసేన’ లో చేరిపోయి పవన్ కోసం ప్రచారం చేయాలని ఆవేశం వస్తుందని అయితే తన ఆవేశం పవన్ కు ఏమాత్రం తెలియదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు చాలాకాలం పవన్ తన కుటుంబ సభ్యులతో మౌనంగా ఉండేవాడు అన్న విషయాలను వివరిస్తూ అయితే ఇప్పుడు పవన్ పూర్తిగా మారిపోయాడు అని అంటోంది నిహారిక.

ముఖ్యంగా తన చిన్న అత్త అన్నా పై పవన్ జోక్ లు వేస్తూ ఉంటాడని తామంతా తమ చిన్నత్తను ఏడిపిస్తూ జోక్ లు వేస్తుంటే పవన్ ఎంజాయ్ చేస్తాడని అలాంటి సందర్భంలో నవ్వుతూ కనిపించే పవన్ నవ్వులో తనకు అమాయకత్వం కనిపిస్తుంది అంటూ నిహారిక కామెంట్ చేసింది. అంతేకాదు పవన్ నవ్వులో తనకు స్వచ్చత కనిపిస్తుంది అంటూ పవన్ వ్యక్తిత్వంలో గర్వం కానీ స్వార్ధం కానీ తనకు కనిపించదనీ అలాంటి వ్యక్తి తనకు బాబాయ్ అని చెప్పుకోవడం తాను గర్వంగా మాత్రమే కాకుండా స్పూర్తిదాయకంగా ఫీల్ అవుతున్నాను అంటూ నిహారిక పవన్ అభిమానులను ఆకర్షించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నా వారు కూడ ‘సూర్యకాంతం’ ధియేటర్స్ వైపు రాకపోవడం నిహారికకు షాక్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: