రణ్‌వీర్‌ సింగ్.. తన నటనతో బాలీవుడ్ ను మెప్పిస్తున్న నవతరం నాయకుడు.. తాజాగా గల్లీబాయ్ సినిమాతో మరో హిట్ కొట్టేశాడు. మరి ఇతన్ని ఎన్టీఆర్ హీరో చేయడమేంటనుకుంటున్నారా.. దానికీ ఓ లింకు ఉంది. 


ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను రణ్‌వీర్ హిందీలో సింబా పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయ్యింది. అయితే సూపర్ హిట్లు రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమాతో తాను మాస్ హీరోను అయ్యానంటాడు రణ్‌వీర్. 

డిసెంబరులో విడుదలైన సింబా ప్రీమియర్‌ చూసిన తర్వాత.. సాలా నేను హీరో అయిపోయా అన్నాడట రణ్‌వీర్. వాస్తవానికి రణ్ వీర్ 2010లోనే హీరో అయ్యాడు. కానీ మాస్  హీరో అయింది మాత్రం సింబాతోనే అంటాడు రణ్‌వీర్. 

అంతకు ముందు చేసిన సినిమాలన్నీ రణ్‌వీర్‌కు నటుడిగా పేరు తెచ్చాయి. కానీ సింబా ఆయన్ను బాలీవుడ్‌ మాస్‌ హీరోని చేసింది. అందుకేనేమో ఈ సినిమాను రణ్‌వీర్‌ థియేటర్లకి వెళ్లి ఓ ఇరవైసార్లయినా చూశాడట. అదీ సంగతి.. మరి ఈ రణ్‌వీర్‌ను హీరో చేసింది మన ఎన్టీఆరే కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: