‘మహర్షి’ విడుదల తేదీ ఖరార్ కావడంతో ఈమూవీ షూటింగ్ కు సంబంధించి ఒక్క పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే వాస్తవ పరిస్థితి వేరు అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి రాబోతున్న మూడు వారాలు వరసగా క్షణం తీరికలేకుండా పనిచేస్తే కాని ‘మహర్షి’ అనుకున్న డేట్ కు విడుదల అవ్వడం కష్టం అన్న మాటలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహర్షి’ సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో తీయవలసిన రెండు పాటలతో పాటు అబుదాబిలో తీయవలసిన ఒక పాటతో పాటు మరికొంత టాకీ పార్ట్ మిగిలి ఉండటంతో ఈ షూటింగ్ అంతా పూర్తి కావడానికి మే మూడవ వారం అయిపోతుంది అని అంటున్నారు. దీనితో ఈమూవీ రీ రికార్డింగ్ పూర్తి చేయడానికి దేవిశ్రీప్రసాద్ కు కనీసం రెండు వారాల సమయం కూడ ఉండదు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈమూవీ ఎడిటింగ్ కు సంబంధించి రకరకాల సమస్యలు ఎదురౌతున్న నేపధ్యంలో ఈ కొత్త సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అన్న చర్చలలో మహేష్ వంశీ పైడిపల్లిలు చాల బిజీగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి ఎన్నో రోజులు కాల్ షీట్స్ ఇచ్చినా వాటిని సక్రమంగా వంశీ పైడిపల్లి ఉపయోగించుకోలేకపోవడం మహేష్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు ఇంత హడావిడి మధ్య ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తున్న పరిస్థుతులలో ఎక్కడైనా ఏకాగ్రత తప్పి పొరపాట్లు జరిగితే దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది అని మహేష్ మధన పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ అనుకున్న డేట్ కు విడుదల కావడానికి అవసరం అయితే ప్రతిరోజు అర్దరాత్రి వరకు పనిచేస్తాను అని మహేష్ వంశీ పైడి పల్లికి చెప్పడమే కాకుండా అన్ని విధాల అతడిని ఉత్సాహపరచడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: