కోలీవుడ్ లో సూపర్ కాంబో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. సూపర్ స్టార్ రజినికాంత్, సక్సెస్ ఫుల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్ 10 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఎన్నాళ్ల నుండో రజినితో సినిమా కోసం ఎదురుచూస్తున్న మురుగదాస్ ఫైనల్ గా ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు.


రీసెంట్ గా మురుగదాస్ విజయ్ తో సర్కార్ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. రజినితో తీసే సినిమా కూడా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. మూవీలో రజిని డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడట. అందులో ఓ పాత్ర పోలీస్ గా ఉంటుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ సూపర్ గా వచ్చిందని తప్పకుండా రజిని సత్తా చాటేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.


కొన్నాళ్లుగా రజిని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయట్లేదు. కబాలి నుండి రీసెంట్ గా వచ్చిన పేట వరకు రజిని స్టామినాకు తగిన వసూళ్లు రాబట్టడంలో వెనుకపడ్డాయి. అయితే కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లో ఉన్న మురుగదాస్ కచ్చితంగా రజిని ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసే సినిమా ఇస్తాడని ఆశిస్తున్నారు.


సినిమాలో కీర్తి సురేష్, నయనతార హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రజిని స్టైల్, మురుగదాస్ టేకింగ్ రెండు సినిమాకు హైలెట్ గా నిలిచేలా చేస్తాయని తెలుస్తుంది. మురుగదాస్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమా తెలుగులో కూడా భరీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: