టాలీవుడ్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకేవేదిక మీద కనిపించడమే చాలా అరుదు. ఎవరికి వారు బలమైన స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న తెలుగు స్టార్స్ మల్టీస్టారర్స్ చేయడం కల అనుకున్నారు. కాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అది సాధ్యమే అని చూపించారు. ఆ తర్వాత చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.


అయితే లేటెస్ట్ గా రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ మీద అందరి ఫోకస్ ఉంది. బాహుబలి తర్వార రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడన్న అంచనాలకు ఏమాత్రం అందకుండా ఆర్.ఆర్.ఆర్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమ తెలుగు రియల్ హీరోస్ కథతో వస్తుందట.


సినిమాలో సీతా రామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ ఇద్దరు చేస్తున్నారు. సినిమాలో వారిద్దరి పాత్రలకు ఈ ఇద్దరు పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టుగా చేస్తున్నారట. ఇద్దరిలో ఎవరు తగ్గకుండా తమ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా అవతల హీరో ఫ్యాన్స్ ను ఔరా అనిపించేలా నటిస్తున్నారట.


ఇక జక్కన్న సినిమాలో ఎమోషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కనిపించే సీన్స్ మాత్రం సినిమాకు హైలెట్ గా నిలవడమే కాదు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటాయట. మొత్తానికి ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు ఇద్దరే అన్నట్టుగా ఆర్.ఆర్.ఆర్ లో అదరగొడతారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: