వచ్చేవారం ‘ఉగాది’ పండుగను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ‘మజిలీ’ మూవీని ప్రమోట్ చేస్తూ నాగచైతన్య ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియ చేసాడు. ఈఇంటర్వ్యూలో తన చిన్నతనం రోజుల గురించి గుర్తుకు చేసుకుంటూ తనకు తన తండ్రి ఎప్పుడూ పాకెట్ మనీ అడిగినంత ఇచ్చేవాడు కాదని అంటూ ఇచ్చిన డబ్బుకు కూడ తెగ లెక్కలు అడిగేవాడని అంటూ చైతన్య తన తండ్రి పై తన చిరుకోపాన్ని బయటపెట్టాడు.

అంతేకాదు తనకు బైక్ లు అంటే ఇష్టమైన పరిస్థుతులలో ‘నాన్నా ఆ బైక్ కొనండి’ అని అడిగినప్పుడు ‘అదెందుకు నీకు అవసరం లేదు కదా’ అంటూ తనను కన్విన్స్ చేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే అప్పట్లో తాను అడిగినది తన తండ్రి నాగార్జున ఇవ్వలేదు అన్నకోపం బాధ తనకు ఉన్నా అది బయటపెట్టకుండా ప్రవర్తించడం వల్ల తనకు నటన అలవాటు అయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఇదే ఇంటర్వ్యూలో తన తమ్ముడు అఖిల్ సినిమాల పరాజయం గురించి మాట్లాడుతూ అఖిల్ టాలెంట్ గురించి తమ కుటుంబంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు అఖిల్ నటించిన మూడు సినిమాలు ఫెయిల్ అయినా అఖిల్ తాను ఏమిటో తాను నిరూపించుకునే రోజు త్వరలో వస్తుంది అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

తన తమ్ముడు అఖిల్ చూడటానికి అందంగా ఉండటమే కాకుండా డాన్స్ లు ఫైట్లు తనకన్నా బాగా చేస్తాడనీ అందువల్ల ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా అఖిల్ రానున్నరోజులలో టాప్ హీరోగా మారడం ఖాయం అని అంటున్నాడు. తనకు చిన్నప్పటి నుంచీ చదువుపట్ల అంత ఆసక్తి లేకపోయినా కేవలం తన తల్లి కోసం బికాం పూర్తిచేసి సినిమాల బాట పట్టాను అంటూ తన తాతయ్య అక్కినేని లేని లోటు తనకు అనుక్షణం కనిపిస్తోంది అంటూ తనకు నిజమైన స్నేహితుడిలా ప్రవర్తించిన తన తాత అక్కినేని జ్ఞాపకాలు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అంటూ చైతన్య ఆజ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ‘మజిలీ’ సక్సస్ పై పూర్తినమ్మకంతో ఉన్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: