ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియకపోయినా అతడు 4 కోట్ల ఖర్చుతో ఒక టాప్ హీరోయిన్ కోసం ఇల్లు కడుతున్న విషయాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు 'సాహూ' లో నటిస్తూ మరొకవైపు జిల్ రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పూజ హెగ్డేలు నటిస్తున్న రాధాకృష్ణ దర్శకత్వంలోని మూవీ 1960 ప్రాంతంనాటి ప్రేమకథ. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ యూరప్ లో పూర్తి చేశారు. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో 'బాహూబలి' మాహిష్మతి సామ్రాజ్యానికి పోలిన విధంగా ఒక భారీ సెట్ నిర్మిస్తున్నారు. 

సుమారు 10 ఎకరాల ప్రాంతంలో ఈసినిమాకు సంబంధించి 18 సెట్లను భారీగా నిర్మించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ లో మూడు సెట్స్ పూర్తి అయినట్లు సమాచారం. అందులో హీరోయిన్ పూజ హెగ్డే పాత్రకు సంబంధించిన ఇంటి  సెట్ కూడ ఉందని తెలుస్తోంది. ఈ సెట్ కోసం 4 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు టాక్. 

1960 సంవత్సరకాలంలో రోమ్ నగరం ఎలా ఉండేది అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉండేది ఎలాంటి వస్తువులు ఉపయోగించే వారు అన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సెట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత మళ్ళీ ఈ యూనిట్ ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళ బోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: