ఈషా రెబ్బా.. అందచందాలకు కొదవ లేకుపోయినా పాపం.. అంతగా బ్రేక్ రాని అమ్మాయి. అందులోనూ మన అచ్చ తెలుగు అమ్మాయి. అసలు తెలుగు అమ్మాయిలు తెలుగు సిన ఇండస్ట్రీలో రాణించడం ఎంత క‌ష్టమో ఇప్పటికే చాలా మందికి తెలిసొచ్చింది. 


అయినా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది ఈషా రెబ్బా.. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలో పోషించిన ఈషా రెబ్బా ఇప్పుడు ఓ హారర్ సినిమా ఒప్పుకుంది. గతంలో ఢమరుకం సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో కొత్త చిత్రాన్ని ఒప్పుకుంది.

తెలుగులో హరర్ సినిమాలు కూడా కొంత మందికి సక్సస్ ఇచ్చాయి. అంజలికి గీతాంజలి, స్వాతి త్రిపుర సినిమాలతో మెప్పించారు. ఇప్పుడు ఈషా రెబ్బా కూడా హారర్ వైపు మొగ్గింది. 

ఐతే... ఈ భామ ఫోటో షూట్లలోనూ అందాలు బాగానే ఆరబోస్తోంది. తాజాగా ఈమె ఇచ్చిన హాట్ ఫోజులు కుర్రాళ్లు గుండెల్లో సెగలు రేపుతున్నాయి. ఏమాత్రం మొహమాట పడని ఈషా రెబ్బా అందాల ప్రదర్శన కుర్రాళ్లను అబ్బా అనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: