నిన్న రాత్రి జరిగిన ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన నాగార్జన తన కోడలు సమంత తెలివితేటల గురించి మురిసిపోతూ ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. ‘ఏమాయ చేసావే’ మూవీ చూసిన తరువాత వీరిద్దరి జంట చాల బాగుంది అని తాను భావించిన విషయాన్ని వివరిస్తూ ఆ తరువాత వీరిద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమను తనకంటే ముందుగా తన కుక్క గుర్తించిన విషయాన్ని నవ్వుతు చెప్పాడు.

ఆ మూవీ తరువాత సమంత చైతన్యలు తరుచూ కలుస్తున్న విషయం కూడ తనకు తెలియదనీ అంతా రహస్యంగా తమ ప్రేమ వ్యవహారాన్ని వారిద్దరూ నడిపించారనీ నాగ్ చెప్పుకొచ్చాడు. అయితే చాల కాలం క్రితం వీరిద్దరి ప్రేమ తనకు తెలియక ముందు సమంత తన ఇంటికి వచ్చిన సందర్భంలో జరిగిన సంఘటన వివరించాడు.

అప్పట్లో సమంత తన ఇంట్లోకి రాగానే తన కుక్క సమంత వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ఆప్యాయంగా ఆమెను నాకుతూ పలకరించిన సందర్భం చూసి తాను షాక్ అయిన విషయాన్ని వివరించాడు. సాధారణంగా తన పెంపుడు కుక్క తన ఫ్యామిలీ సభ్యుల పై మాత్రమే అలాంటి ప్రేమను చూపెడుతుందనీ దానితో అనుమానం వచ్చి సమంతను అడిగితే తనకు ఆ కుక్క ఎప్పటి నుంచో తెలుసు అన్న షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.

ఆ సంఘటన తరువాత చైతన్యను పూర్తిగా కార్నర్ చేస్తే తమ ప్రేమ విషయం బయట పెట్టడమే కాకుండా తాము బయటకు కారులో వెళుతున్నప్పుడు తమకూడా ఆ కుక్కను కూడ తీసుకువెళ్ళిన అనేక సందర్భాలు ఉన్నాయి అని చైతన్య నెమ్మదిగా చెప్పాడు అంటూ జోక్ చేసాడు నాగార్జున. దీనితో వీరిద్దరి ప్రేమను తమ కుటుంబ సభ్యులకంటే ముందుగా తమ కుక్క గుర్తించింది అంటూ నాగ్ అనగానే ‘మజిలీ’ ఫంక్షన్ లో నవ్వులు సందడి చేసాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: