‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు నాగార్జున వెంకటేష్ లు అతిధులుగా వచ్చినా మీడియా కెమెరాల దృష్టి అంతా సమంత ఈ ఫంక్షన్ కు పెట్టుకు వచ్చిన ‘వజ్రాల నెక్లెస్’ పై ఫోకస్ పెట్టింది. వైట్ అండ్ బ్రౌన్ డిజైనర్ కాంబినేషన్ డ్రెస్ తో పాటు వజ్రాల హారంతో మెరిసిపోయిన సమంత వైపే మీడియా కెమేరాలన్నీ క్లిక్ మనిపించాయి. 

ఈమధ్య కాలంలో పెళ్లి అయిన తరువాత కూడ ఎక్స్ పోజ్ చేస్తూ ఫ్యాషన్ మ్యాగజైన్స్ కు ఫోటో షూట్స్ ఇచ్చిన సమంత ఇలా లక్ష్మీ దేవిలా మెరవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలగచేసింది. మరికొందరైతే ఈ ఫంక్షన్ కు నాగార్జున వెంకటేష్ లు అతిధులుగా రావడంతో అక్కినేని కోడలుగా తన ఇమేజ్ ని చాటుకోవడానికి ఇలా సమంత మెరిసిపోయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించి నిన్న విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ఎక్కువగా సెంటిమెంట్ సీన్స్ మీద ఫోకస్ పెట్టడంతో ఈ ట్రైలర్ లో కొంత వరకు తమిళ సినిమాల ప్రభావం కనిపించింది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీలోని ప్రీ లవ్ ఎపిసోడ్ అలాగే పోస్ట్ క్రికెట్ ఎపిసోడ్ పై కాకుండా సమంత నాగాచైతన్యల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. 

అయితే ఈ విషయాలను పక్కకు పెడితే ఒక మంచి ఫ్యామిలీ మూవీ ఈ సమ్మర్ ను టార్గెట్ చేస్తూ ఉగాదికి రాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు పెళ్లి తరువాత చైతన్య సమంతలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ పై ఎటువంటి సందేహాలు లేవు. అయితే ఇంత భారీ సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ కు బిసి సెంటర్ల ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మాత్రమే సందేహం..   


మరింత సమాచారం తెలుసుకోండి: