మజిలీ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఓ ఆత్మీయ సన్నివేశం చోటు చేసుకుంది. హీరో నాగచైతన్యను మరో హీరో వెంకటేశ్ గుండెలకు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆ దృశ్యం అందరినీ మైమరపింపజేసింది. మరి వెంకటేశ్ ఎందుకు నాగ చైతన్యను హత్తుకున్నారు..? 


ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న వెంకటేశ్‌ కు కార్యక్రమ నిర్వాహకులు ముందుగానే మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేను తక్కువ మాట్లాడతాననే కదా నాకు ముందు ఇచ్చారు అంటూ కామెడీగా స్పీచ్ ప్రారంభించిన వెంకటేశ్ ఆ తర్వాత ఎమోషనల్ అయ్యారు. 

మజిలీ సినిమా టీజర్ చూసినప్పుడే పెద్ద హిట్ అవుతుందనుకున్నానన్నారు వెంకటేశ్. ఆ తరవాత ట్రైలర్ చూసి ఇక డౌట్ లేది ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్నారట. ఈ సినిమా దర్శకుడు అంతకుముందే మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత అంతా నాగచైతన్యను హత్తుకుంటారు అన్నారు. 

ఆ విషయాన్ని గుర్తు చేసిన వెంకటేశ్.. అంతా సినిమా చూశాక హత్తుకుంటారని చెబుతున్నారు.. కానీ నో డౌట్‌ ఇది బంపర్ హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ముందుగానే నాగచైతన్యను హత్తుకుంటా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు వెంకటేశ్. 



మరింత సమాచారం తెలుసుకోండి: