అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకుని దుమ్ముదులిపేసిన విజయ్ దేవరకొండ యూత్ లో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో కూడా సత్తా చాటిన విజయ్ టాక్సీవాలాతో కూడా హిట్ కొట్టాడు. అన్న విజయ్ దేవరకొండ స్పూర్తితో తమ్ముడు ఆనంద్ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు.


ఆనంద్ తొలి సినిమా దొరసాని. యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న దొరసాని ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. గాల్లో తేలుతున్న చున్ని పోస్టర్ తో టైటిల్ వెనకాల ఓ విలేజ్ ను చూపిస్తూ ఈ పోస్టర్ వదిలారు.


నిజ జీవితాల నుండి ప్రేరణతో అంటూ ఓ క్యాప్షన్ కూడా ఉంది. దొరసాని మూవీతో అన్నే కాదు తమ్ముడు కూడా సత్తా చాటేలా ఉన్నాడు ఆనంద్ దేవరకొండ. కె.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. కచ్చితంగా విజయ్ దేవరకొండ తరహాలోనే ఆనంద్ కూడా అదరగొట్టేలా ఉన్నాడు.


అతి తక్కువ టైంలో యూత్ లో బాగా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడిని లైన్ లోకి తెచ్చాడు. మరి విజయ్ లానే ఆనంద్ కూడా యువత మనసు గెలుస్తాడా లేడా అన్నది చూడాలి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి క్రేజ్ బాగానే వచ్చేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: