అక్కినేని నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షైన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది.


కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్టులుగా వచ్చిన ఈ ఈవెంట్ అంతా సందడి సందడిగా జరిగింది. ఇక ఈవేడుకలో మజిలీ దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఓ డైలాగ్ విషయంలో అప్సెట్ అయ్యారని తెలుస్తుంది. వెధవలకు భార్యలుగా మంచి అమ్మాయిలే వస్తారని డైలాగ్ నాగార్జునని అప్సెట్ చేసిందట.


అయితే ఈవెంట్ లో మాట్లాడుతూ ఆ డైలాగ్ సంగతి పక్కన పడితే సినిమా బాగుంటుంది. మా మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరికిందని చైతు, సమంతలను చూపిస్తూ చెప్పాడు. ఈవెంట్ లో వెంకటేష్ కూడా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. శివ నిర్వాణకు తను ఏం చేయాలో బాగా క్లారిటీ ఉన్న వ్యక్తని అందుకే నిన్ను కోరి హిట్ అయ్యిందని మజిలీ ఉగాదిన రిలీజై సూపర్ సక్సెస్ అవుతుందని అన్నారు.


చైతు, సామ్ లు కూడా బాగా చేశారని.. సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్ కొట్టేలా ఉందని అన్నారు వెంకటేష్. వేడుకలో వెంకటేష్, నాగార్జునల మధ్య సాన్నిహిత్యం ఫ్యాన్స్ ను అలరించాయి. నాగ చైతన్య, సమంతలు మజిలీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: