ప్రజలకు సెంటిమెంట్లు పెరిగిపోవడంతో సినిమా టైటిల్స్ విషయంలోనే కాదు సినిమాలో చిత్రీకరించే సీన్స్ విషయంలో కూడ తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘సైరా’ షూటింగ్ కు సంబంధించి దేవతా విగ్రహాల సెంటిమెంట్ అడ్డు రావడంతో ఈమూవీ షూటింగ్ కోసం అవుట్ డోర్ లో కాకుండా చరణ్ ఒక ప్రత్యేకమైన సెట్ ను వేయడం ఆశ్చర్యకరంగా మారింది.

అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చిత్రీకరిస్తున్న ‘సైరా’ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు కర్ణాటకలోని బీదర్ కోటలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ బీదర్ కోటలో దేవతా విగ్రహాలు ఉన్న నేపధ్యంలో అక్కడ షూటింగ్  జరపడానికి తాము అంగీకరించం అని అక్కడ స్థానికులు చెప్పడంతో బీదర్ కోటలో ‘సైరా’ షూటింగ్ ను మధ్యలో ఆపి వేసారు. 

దీనితో ఆ షూటింగ్ కు సంబంధించి పెండింగ్ వర్క్ ను పూర్తి చేయడానికి చరణ్ బీదర్ కోటను పోలిన ఒక ప్రత్యేకమైన సెట్ ను కోకాపేటలో నిర్మించి అక్కడ ఈ పెండింగ్ వర్క్ ను ఈనెల మొదటి వారంలో పూర్తి చేయబోతున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత ఈమూవీలోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం ఈమూవీ యూనిట్ ఇదే నెలలో చైనా వెళ్ళబోతోంది. 

ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను మే చివరకు షూటింగ్ పూర్తి చేయాలి అని చిరంజీవి సురేంద్రరెడ్డికి టార్గెట్ ఇచ్చినా ఆ టార్గెట్ ప్రకారం ఈమూవీ షూటింగ్ జరగడం లేదు అని టాక్. దీనితో ఈ సంవత్సరం ఈసినిమా విడుదల కాకపోవచ్చనీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి మాత్రమే ఈ మూవీ విడుదల అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: