టాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్స్ నాగ చైతన్య సమంత 8 ఏళ్లుగా ప్రేమించుకుని ఫైనల్ గా 2017లో పెళ్లి చేసుకున్నారు. ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించారు. లేటెస్ట్ గా మజిలీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.


ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సమంతలో ఏ క్వాలిటీ మీకు బాగా నచ్చుతుందని అడుగగా మంచితనం అన్నాడు చైతు అది ఎప్పుడూ చెప్పేదే అది కాకుండా ఇంకేమైనా కొత్తగా చెప్పండని అంటుంది సమంత. అది కాకుండా ఏదైనా డిసైడ్ అయితే అది పూర్తయ్యే వరకు తను దాని మీదే ఉంటుందని అది తనకు బాగా నచ్చుతుందని అన్నాడు చైతన్య.


ఇక చైతులో తనకు నచ్చిన క్వాలిటీ గురించి చెబుతూ తనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎక్కువ ఎక్సైట్ అవుతానని.. చైతు ఎప్పుడూ స్టేబుల్ గా ఉంటాడని అది తన నుండి నేను నేర్చుకుంటున్నా అని అన్నారు సమంత. మొత్తానికి ఈ అక్కినేని యువ జంట నటించిన మజిలీతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలిచేందుకు సిద్ధమయ్యారు.


నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా చేసిన సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందించారు. దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్ని సూపర్ హిట్ కాగా శుక్రవారం వస్తున్న ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: