సాధారణంగా కార్తీకమాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసి ఆ భోజనాలకు వచ్చే అతిధులకోసం ప్రత్యేకమైన బస్సులు కుల సంఘాల నాయకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని చూడటానికి కొందరు ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఖమ్మం తీసుకు వచ్చి అక్కడ ధియేటర్లలో సినిమాను చూపించి వారికి హోటల్స్ లో మంచి భోజనాలను కూడ పెట్టించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న కృష్ణాజిల్లాకు సంబంధించి ముఖ్యంగా నందిగామ తిరుఊరు నూజివీడు మైలవరం ప్రాంతాలకు సంబంధించిన జనాన్ని అక్కడ ఎన్నికలలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రత్యేకంగా బస్సులలో ఖమ్మం తీసుకు వచ్చి ఈ వీకెండ్ లో ఖమ్మంలో వారికి ఈసినిమాను చూపించినట్లు టాక్. అదేవిధంగా పోలవరం చింతలపూడి ప్రాంతాలకు చెందిన ప్రజలను కూడ ఖమ్మం తీసుకు రావడమే కాకుండా అది ఒక పిక్నిక్ పార్టీలా మార్చి జనానికి ఆనందం కలిగిస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. 

దీనికితోడు ఈ సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్డుకున్నప్పటికీ ఈమూవీలోని కీలక సన్నివేశాలు ఆంధ్రప్రామ్తంలోని కొన్ని లక్షల సెల్ ఫోన్స్ కు షేర్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈమూవీ విడుదల కాకపోయినా చేయగలిగిన హంగామా అంతా చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైశ్రాయి ఎపిసోడ్ సీన్ ను క్లిపింగ్స్ రూపంలో షేర్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీలోని సీన్స్ ప్రభావం ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈరోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆంధ్రాలో అడ్డుకుంటూ అక్కడి న్యాయమూర్తి ఇచ్చిన స్టేను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈమూవీ నిర్మాతలు ఇదే కోర్టుకు సంబంధించి ఫుల్ బెంచ్ ని ఆశ్రయించబోతున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించి ఈ వీకెండ్ కలక్షన్స్ బాగా వాచ్చినా ఈరోజు వర్కింగ్ డే కావడంతో ఈమూవీకి వచ్చే కలక్షన్స్ బట్టి ఈమూవీ ఎంత వరకు విజయం సాధించింది అన్న విషయమై క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: