మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్ర పోరాట యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

Image result for sye raa narasimha reddy

ఈ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాని వచ్చే స్వాతంత్ర దినోత్సవ రోజున విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాత చెర్రీ కి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతున్న క్రమంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై సీరియస్ అయినట్లు ఫిలింనగర్ లో టాక్.

Image result for sye raa narasimha reddy

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని మే 5 లోపల పూర్తి చేయాలని రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కి చెప్పారట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే కొత్త షెడ్యూల్ ఒక వారం పాటు చైనా లేదా మధ్యప్రదేశ్లో షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై మెగా అభిమానులు బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: