రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఎప్పుడు ఎలా మారి పోతాయో ఎవరికి అర్ధం కానీ ఒక పజిల్.  వర్మ ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడోతెలియని పరిస్థితులు.  అయితే వర్మ  అనౌన్స్ చేసిన సినిమా  నిజంగా తీస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  సక్సస్ జోష్ మీద ఉన్న వర్మ మరో షాకింగ్  మూవీకి శ్రీకారం చుడుతున్నాడు.  

 గతంలో వర్మ అనౌన్స్ చేసిన 'శశికళ' చిత్రాన్నిమళ్ళీ  బయటికి తీశాడు. ఇదే తన తర్వాత సినిమా అని త్వరలోనే విడుదల కూడా అవుతుందని వర్మ ప్రకటించడం  అందరికి షాకింగ్ న్యూస్ గా మారింది.  జయలలిత మరణించిన తరువాత శశికళ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన కొత్తలో వర్మ 'శశికళ' సినిమాను అనౌన్స్ చేశాడు. 

కానీ ఆ తరువాత ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఎక్కడా బయటకు రాలేదు.  కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పడు వర్మ మాట్లాడటం మొదలు పెట్టడమే కాకుండా ఏకంగా 'కమింగ్ సూన్' అంటూ ట్విట్ చేయడంతో ఈ సినిమాను వర్మ ఇప్పటికే పూర్తి చేశాడా అన్న అనుమానాలు వస్తున్నాయి.  

లక్ష్మి పార్వతి జీవితంలాగే శశికళ జీవితంలో కూడా  అనేక ట్విస్టులు సంచలనాలు వివాదాలు ఉన్నాయి. అయితే  ఎన్టీఆర్ భార్యగా లక్ష్మి పార్వతి పై తెలుగు ప్రజలలో ఇప్పటికి కొంత గౌరవం ఉంది.  'శశికళ' తమిళనాడుకు చెందిన మహిళా కావడంతో ఆమె కధకు తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్నది ప్రశ్న.   అయితే  వర్మ మళ్ళీ  ఫాంలోకి వచ్చిన నేపధ్యంలో ఈ సినిమాను అడ్డం పెట్టుకుని వర్మ మంచి బిజినెస్ చేసుకునే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: