రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ అసలు కథగా వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఈ శుక్రవారం రిలీజైంది. ఏపిలో రిలీజ్ కాకుండా ఆపేసిన తెలంగాణాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా నటించిన విజయ్ కుమార్ అదరగొట్టగా చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీ తేజ్ కూడా అచ్చం బాబు గారిని దించేశాడు.


వర్మ తీసిన వంగవీటి సినిమాలో నటించిన శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో చంద్రబాబు పాత్రలో మెప్పించాడు. సినిమాలో అతని అభినయానికి మంచి పేరు వస్తుంది. తను చంద్రబాబు పాత్ర చేయడానికి మెంటల్ గా బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా చెప్పుకొచ్చిన చిరంజీవి తను ఇంత బాగా నటించడానికి మెగాస్టార్ చిరంజీవి ఓ కారణమని అన్నారు.


ఇంద్ర, ఠాగూర్ సినిమాల టైంలో చిరంజీవి గారు ఓ ఇంటర్వ్యూలో మీరు ఇంత బాగా ఎలా పాత్రకు 100 శాతం న్యాయం చేస్తారని ఇంటర్వ్యూయర్ అడుగగా మెంటల్ గా ఫిక్స్ అయ్యి చేస్తానని అన్నారు. అందుకే ఆయన స్పూర్తితో తాను కూడా చంద్రబాబు పాత్రని చేశానని చెప్పారు శ్రీ తేజ్.


లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతిగా చేసిన యజ్ఞా శెట్టి కూడా ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు. తెలంగాణాలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. ఏపిలో హై కోర్ట్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై స్టే విధించగా దర్శక నిర్మాతలు సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. మరి అక్కడ సినిమాపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: