దర్శకధీరుడు రాజమౌళి తిసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ సంపాదించారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.  దాంతో ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా తీసినా చాలా పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నాడు.  ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాపై అప్పుడే మంచి క్రేజ్ వస్తుంది.  భారీ యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ గా రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మిగతా సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  ప్రభాస్ కి సాహూ 19వ సినిమా.   ఈ గ్యాపులో ప్రభాస్ .. దర్శకుడు రాధాకృష్ణతో కలిసి సెట్స్ పైకి వచ్చేశాడు. ప్రభాస్ 20వ సినిమాగా ఇది నిర్మితమవుతోంది. ఇటీవలే యూరప్ లో రెండవ షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.  వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలు పాట కూడా చిత్రీకరించినట్టు సమాచారం.

1970 కాలంనాటి ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రస్తుతం..ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ప్రేమకథగా రూపొందుతుందట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ ప్లే చేస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వదిలిన ప్రభాస్ ఫొటో చూస్తుంటే ఆయన బాగా బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: