టాలీవుడ్ ఇండస్ట్రీ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర పోకిరి, దూకుడు వంటి సినిమాలతో చరిత్ర సృష్టించాడు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సినిమా తన కెరియర్లోనే ఇప్పటివరకు చేయని పాత్ర అనగా మహేష్ బాబు ఆర్మీ పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో అని ఇప్పటికే ప్రకటించాడు.

Image result for mahesh babu

ఈ నేపథ్యంలో మహర్షి సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మరికొద్ది రోజుల్లో వేసవి కానుకగా విడుదల కాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి రెడీ అయిన మహేష్ తన నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేయబోయే ప్రాజెక్టు కి కూడా అన్ని విధాల సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related image

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమాలో ఫ‌స్ట్ టైమ్ మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా స్టైల్లో కనిపించనున్నట్లు కథ కూడా అదే విధంగా సిద్ధం చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. సుకుమార్ తో సినిమా కాదని మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో ప్రకటించి అనిల్ రావిపూడి తో చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందోనని మహేష్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు..మరోవైపు విడుదలకు సిద్ధంగా ఉన్న మహర్షి సినిమాపై కూడా అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: