త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో అల్లు అర్జున్‌ సినిమా ఖరారు అయి ఆరునెలలు కావస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగి మూడు నెలలు కావస్తున్నా ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టడానికి అల్లు అర్జున్‌ ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నాడు అని టాక్.

గత ఏడాది కాలంగా షూటింగ్‌ అంటూ చేయని అల్లు అర్జున్‌ ఈ మూవీ షూటింగ్ కు తాను ఇంకా మానసికంగా సిద్ధంగా లేను అంటూ త్రివిక్రమ్ ను మరికొంత సమయం అడిగినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ నెల8వ తారీఖున రాబోతున్న అల్లు అర్జున్ పుట్టినరోజునాడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభిద్దాము అని భావించిన త్రివిక్రమ్ ఆలోచనలు  మళ్ళీ అటకెక్కాయి అని అంటున్నారు.

ఇలా బన్నీ ప్రవర్తించడానికి ఈ మూవీకి సంబంధించిన సెకండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇంకా పూర్తిగా నచ్చకపోవడమే అని అంటున్నారు. దీనితో ఈ విషయాన్ని సూటిగా త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ కు చెప్పలేక ఇలా వ్యూహాత్మకంగా బన్నీ తప్పించుకుంటున్నాడు అంటూ వార్తల హడావిడి చేస్తున్నాయి. 

అయితే ఈ మూవీ ప్రాజక్ట్ ఎట్టి పరిస్తుతులలోను ఉంటుంది అని నిర్మాతలు ప్రకటనలు ఇస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ మనసులో ఏముంది అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సుకుమార్ ఈ మధ్య బన్నీని కలిసి మరో కథ చెప్పాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ పరిస్థితి ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనితో జరుగుతున్న విషయాల పై ఎలాంటి క్లారిటీ రాక త్రివిక్రమ్ తెగ మధన  పడిపోతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: