మరో తొమ్మిది రోజులలో జరగబోతున్న ఎన్నికలలో తన అభిమానులు ఏపార్టీకి ఓటు వెయ్యాలో పిలుపు ఇవ్వకుండా మహేష్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ తాను అందరివాడినీ అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య గుంటూరులో జరిగిన మహేష్ అభిమానుల రహస్య ఆత్మీయ సమావేశానికి ‘మహర్షి’ అన్న పేరుతో పిలుపులు అభిమానులకు అందాయి. 

ఈ సమావేశానికి మహేష్ బావ సుధీర్ బాబుతో పాటు గుంటూర్ పార్లమెంట్ అభ్యర్ది గల్లా జయదేవ్ కూడ హాజరైనట్లు టాక్. ఈ సమావేశంలో సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థుతులలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక హోదా చాల అవసరం అని చెప్పడమే కాకుండా దీనికోసం తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పోరాడిన గల్లా జయదేవ్ ను గెలిపించమని మహేష్ దూతగా వచ్చి మహేష్ అభిమానులను కోరినట్లు టాక్. 

ఈ ఆత్మీయ సమావేశానికి గుంటూరు ప్రాంతంలోని అనేకమంది మహేష్ అభిమాన సంఘాల నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే కేవలం సుధీర్ బాబు ఒక మాట చెపితే మహేష్ అభిమానులు నిజంగా గల్లా జయదేవ్ విజయం కోసం పాటుపడతారా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఎన్నికలు జరుగుతున్న అనేక అసెంబ్లీ ప్రాంతాలలో కొన్ని చోట్ల మహేష్ అభిమాన సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మహేష్ అభిమానులు కొన్ని చోట్ల తెలుగుదేశంకు మరికొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధులకు ప్రచారం చేస్తూ మహేష్ అన్ని పార్టీలకు సంబంధించిన వాడు అన్న సంకేతాలుఇస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: