తమిళ నాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అలనాటి అందాల తార జయలలిత అనారోగ్యం కారణం చేత మృతి చెందారు. మహానటులు ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా ఆమె పదవిచేపట్టి పలుమార్లు ముఖ్యమంత్రిగా ఎన్నోకొబడ్డారు.  ఆమె ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రజల్లో ఆమెను ఉన్నత శిఖరానికి చేర్చాయి.  తమిళ నాట అందరూ అమ్మ అని పిలుచుకునే స్థాయికి చేరుకుంది.  ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జయలలిత బయోపిక్ తీసేందుకు సిద్దమవుతున్నారు. 

జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘తలైవి’ సినిమాలో ఆమె జయలలిత పాత్రను పోషించబోతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్.  మణికర్ణిక లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కంగనా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. తాజాగా కంగనా మాట్లాడుతూ..సమస్యల్ని ఎదుర్కొని నిలదొక్కుకున్న తీరు అమోఘమని కొనియాడింది. జయ ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారని, ఇంకెన్నో కష్టాలు అనుభవించారని గుర్తు చేసింది. కానీ  ఆమె స్వభావం తనకు పూర్తిగా వ్యతిరేకమంది.   

జయలలిత సినిమా చేయాలంటూ దర్శక, నిర్మాతలు తన వద్దకు వచ్చినప్పుడు తాను కొంత సమయం కావాలని అడిగానని చెప్పిన కంగన.. ఆ సమయంలో జయలలిత గురించి తెలుసుకునేందుకు కొన్ని పుస్తకాలు చదివానని, కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపింది.  ఆమె గురించి క్షుణ్ణంగా తెలుసుకొని నటిస్తే మంచి మార్కులు పడతాయని కంగనా ఆశపడుతుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: