అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేస్తుంది.


నాగ చైతన్య సమంత పెళ్లి తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రియల్ లైఫ్ భార్యా భర్తలు రీల్ లైఫ్ లో కూడా అలా నటించడం అరుదుగా జరుగుతుంది అలాంటిది ఈ యంగ్ కపుల్ రీల్ లైఫ్ లో భార్యా భర్తలుగా నటించారు. పెళ్లి తర్వాత సమంత తన విజయ పరంపర కొనసాగిస్తుండగా చైతుకి తన లక్ పంచాలని చూస్తుంది సమంత.


మజిలీ సినిమాలో సమంతతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆడియెన్స్ ను మెప్పించగా సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల మనసు గెలుస్తుందని అంటున్నారు. ఇక ఏరియాల వారిగా మజిలీ బిజినెస్ డీటైల్స్ ఎలా ఉన్నాయో చూస్తే..  


నైజాం : 6 కోట్లు 
సీడెడ్ : 2.50 కోట్లు 
ఉత్తరాంధ్ర : 1.98 కోట్లు 
ఈస్ట్ : 1.44 కోట్లు 
వెస్ట్ : 1.12 కోట్లు 
కృష్ణా : 1.28 కోట్లు 
గుంటూరు : 1.62 కోట్లు 
నెల్లూరు : 0.70 కోట్లు 
ఏపి/తెలంగాణ : 16.64 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు 
ఓవర్సీస్ : 3 కోట్లు 
వరల్డ్ వైడ్ : 21.14 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: