ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో హీరోలు కూడ తాము నటించే సినిమాల కథల ఎంపికలో వెరైటీ చూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రొటీన్ పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆ పాత్రల కోసం చాల కష్టపడుతున్నారు. 

అయితే ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘మజిలీ’ ‘జెర్సీ’ ‘డియర్ కామ్రేడ్’ ఇలా మూడు సినిమాల కథలు క్రికెట్ నేపధ్యంలో ఉండటంతో ఒకేసారి చాల తక్కువ గ్యాప్ లో వస్తున్న ఈమూడు క్రికెట్ కథలలో ఏ కథకు ప్రేక్షకుల ఆమోదం లభిస్తుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  నాగచైతన్య సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ మూవీలో చైతన్య క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. 

క్రికెట్ అంటే ఇష్టంతో ఏ ఉద్యోగం చేయలేక నిరుద్యోగిగా ఒక విలక్షణమైన పాత్రలో చైతన్య నటిస్తున్నాడు. ఈసినిమా విడుదలైన కేవలం రెండు వారాల గ్యాప్ తో నాని నటించిన ‘జెర్సీ’ విడుదల కాబోతోంది. ఇందులో నాని అర్జున్ అనే 36 ఏళ్ల క్రికెటర్ గా కనిపించనున్నాడు. జర్నీ ఆఫ్ జెర్సీ పేరుతో ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలో క్రికెటర్ గా కనిపించడానికి నాని ఎంత కష్టపడ్డాడో అందరికీ అర్ధం అయింది. ఈ రెండు సినిమాల తరువాత ఒక నెల గ్యాప్ ఇచ్చి విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీలో కూడ క్రికెట్ నేపధ్యం కనిపిస్తుంది. 

ఇలా ముగ్గురు టాప్ యంగ్ హీరోలు ఒకే రకం ఆటకు సంబంధించిన కథను తమ సినిమాలుగా ఎంచుకోవడం యాధృశ్చికమే అయినా ఒకే సమ్మర్ సీజన్ లో ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కావడం ఆశ్చర్యకరంగా మారింది. ఈమూడు సినిమాలకు మంచి ప్రీ రిలీజ్ టాక్ ఉన్న నేపధ్యంలో ఈమూడు సినిమాల పై 150 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది దీనితో టాలీవుడ్ టాప్ క్రికెట్ హీరో ఎవరు అన్న విషయమై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: