రైటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన అతను డైరక్టర్ గా మారి వరుస హిట్లు కొడుతున్నాడు. అయితే ఆయన హిట్లు కొడుతున్నా సరే వెంటనే మరో సినిమా చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరు అంటే కొరటాల శివ అని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టిన కొరటాల శివ భరత్ నేను వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరే మరో సినిమా మొదలు పెట్టలేదు.


భరత్ అనే నేను తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా కన్ఫాం చేసుకున్న కొరటాల శివ సంక్రాంతి టైంలో సినిమా ముహుర్తం పెట్టుకున్నాడు. అయితే ఓ పక్క భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సైరా సినిమా షూటింగ్ లేటు అవుతుండటంతో కొరటాల శివ సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తుంది. చిరుతో సినిమా ఓకే చేసుకున్నా మధ్యలో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు కొరటాల శివ.


కాని హీరోలెవరు ఖాళీగా లేకపోవడంతో వెయిట్ చేయక తప్పలేదు. ఈ సమ్మర్ లో కొరటాల శివ, చిరంజీవి సినిమా మొదలు పెడతారని మొన్నటిదాకా చెప్పినా ఇప్పుడు సైరా రిలీజ్ దాకా కొరటాల శివ వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. చిరు సినిమా లేట్ అవడంతో కొరటాల శివ కూడా కాస్త అప్సెట్ లో ఉన్నాడని తెలుస్తుంది.


ఇక సైరా విషయానికొస్తే డైరక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడట. ఇప్పటికే అతని మీద చిరు, చరణ్ ఇద్దరు గొడవ పడినట్టు వార్తలు వస్తున్నాయి. 200 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా సినిమాను చిరంజీవి ఎంతో ప్రెస్టిజియస్ గా తీసుకున్నారు. మరి సినిమా అవుట్ పుట్ అదే రేంజ్ లో వస్తుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: