ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, నటుడు జే మ‌హేంద్ర‌న్(79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ(2 ఏప్రిల్ 2019) ఉద‌యం చనిపోయినట్లు మహేంద్రన్ తనయుడు, దర్శకుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు.   సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్న హిట్ సినిమా అందించి ఆయన ఉన్నత శిఖరానికి చేర్చినవారిలో ఈయన ఒకరు.  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు.

Image result for j mahendran

మహేంద్రన్ మృతివార్తతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార వర్గాలు ఆయనకు సంతాపం ప్రకటించాయి.  ఆయనకు జాన్ మహేంద్రన్ అనే కుమారుడు ఉన్నారు. మణిరత్నం, శంకర్ వంటి ప్రస్తుత దిగ్గజ దర్శకులకు ఆయనే మార్గదర్శి.  దర్శకుడు మహేంద్రన్ మరణవార్తను ఆయన కుమారుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. జే మహేంద్రన్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ డైరెక్టర్ మహేంద్రన్ ఇకలేరు.  కాగా, దర్శకుడు మహేంద్రన్ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు.


ప్రజలు, అభిమానులు, సినీ దర్శకుల సందర్శనార్థం పార్దీవదేహాన్ని ఉంచుతారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 80 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన మహేంద్రన్, రెండు సార్లు జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. చెన్నైలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ బీఓఎఫ్టీఏ డైరెక్షన్ విభాగం హెడ్ గా పనిచేస్తూ, ఎంతో మందిని దర్శకులుగా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం విడుదలైన పెటా, బూమరాంగ్ చిత్రాల్లోనూ ఆయన నటించారు.  తాజాగా  జే మ‌హేంద్ర‌న్ మృతిపై కోెలీవుడ్ వర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: