ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ ఈఏడాది విడుదల అయితే రాధ కృష్ణ దర్సకత్వంలో నటిస్తున్న మరో మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సినిమాలు ఇంకా విడుదల కాకుండానే ప్రభాస్ కు సంబంధించిన మరో సినిమా వార్తలు తెరపైకి రావడం ఆ చర్చలు అన్ని సమంత చుట్టూ తిరగడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఇండస్ట్రీ లో హడావిడి చేస్తున్న ఈ వార్హల ప్రకారం  ప్రభాస్ సమంతతో ఒక సినిమాలో నటించే విష్యంలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో అత్యధిక శాతం సక్సస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. తెలుగు తమిళ భాషల్లో పలువురి స్టార్ హీరోలతో సమంత ఇప్పటికే  నటించింది. ఆమె నటించిన చిత్రాలలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినవి  చాలా ఉన్నాయి  ఉన్నాయి.  

ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ హీరోగా తాను  వచ్చే సంవత్సరం తీయబోతున్న సినిమాలో సమంతని ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న విష్యంలో దిల్ రాజ్ ప్రభాస్ సలహాను అడిగినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు  దిల్ రాజు వద్ద ప్రస్తుతం ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడే అద్భుతమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కధను ఒక యంగ్ రైటర్ రాసినట్లు సమాచారం. 

అయితే ఈ కథను దర్శకత్వం చేయగల దర్శకుడు కోసం దిల్ రాజ్ అన్వేషణ సాగిస్తున్న పరిస్థుతులలో ఈ కథని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడి కోసం దిల్ రాజు వెతుకుతున్నాడట. బహుశా 2020లో ఈసినిమా గురించి ఆలోచిస్తాను అని ప్రభాస్ చెప్పినట్లు టాక్. అయితే ఈలోపున ఈకథను రేఖా మాత్రంగా సమంతకు దిల్ రాజ్ చెప్పడంతో ఆమె ప్రభాస్ తో నటించడానికి ఓకె సిగ్నల్ ఇచ్చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలలో ఎన్ని యదార్దాలు అన్న విషయం తెలియాలి అంటే మరికొంత కాలం ఎదురు చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: