ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో పవన్ ‘జనసేన’ కు ఆ పార్టీ పోటీచేసే స్థానాలలో సుమారు 12 శాతం ఓట్లు పడతాయని మరికొన్ని ముఖ్య స్థానాలలో ‘జనసేన’ కు 15 శాతం వరకు ఓట్లు పడతాయని ఇచ్చిన అంచనాలు ప్రధాన రాజకీయ పార్టీలకు గుబులు పుట్టిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ ఓట్ల శాతం నిశ్శబ్ద విప్లవంగా మారి ఏ ప్రధాన రాజకీయ పార్టీ ఓట్లకు గండి కొడుతుంది అన్న విషయమై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి లోతైన చర్చలు జరుగుతున్నాయి.

దీనికితోడు ఈరోజు మాయావతితో కలిసి పవన్ చేపట్టబోతున్న సుడిగాలి పర్యటన ఎంతమేరకు దళిత ఓటర్ల మీద ప్రభావం చూపెడుతుంది అన్న విషయమై విశ్లేషకులు కూడ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇది చాలదు అన్నట్లుగా ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నిశ్శబ్ద విప్లవ సర్వేని సమర్ధిస్తూ కామెంట్స్ చేయడంతో జనసేన ఖచ్చితంగా కొంతమేరకు సక్సస్ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

దీనితో ఎలర్ట్ అయిన ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన కొన్ని తెలుగు దిన పత్రికలు పవన్ సభలకు జనం రాకపోవడంతో ఆఖరి నిముషంలో ఆ పబ్లిక్ మీటింగ్స్ ను క్యాన్సిల్ చేసారు అంటూ ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన చోడవరం అనకాపల్లి పెందుర్తి ప్రాంతాలలో పవన్ నిన్న నిర్వహించడానికి ప్రయత్నించిన బహిరంగ సభలు జనం రాకపోవడంతో క్యాన్సిల్ అయ్యాయి అంటూ పవన్ సభలకు జనం రావడంలేదు అన్న విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. 

దీనితో ఇప్పటి వరకు పవన్ గురించి పాజిటివ్ గా కాని నెగిటివ్ గా కాని వార్తలు రాయని ఆ పత్రికలు ఇలా పవన్ పై కొత్త ప్రచారం అందుకోవడంతో నిజంగానే రాబోతున్న ఎన్నికలకు ఓట్లు వేసేవారిలో ఎంతోకొంత నిశ్శబ్ద విప్లవాన్ని జనసేన సృష్టిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో మొదటిసారి ఓటు హక్కు లభించిన వారి సంఖ్య సుమారు 40 లక్షలు వరకు ఉన్న నేపధ్యంలో ఈ ఓటర్లు పవన్ వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా జనసేన ‘నిశ్శబ్ద విప్లవం’ సృష్టించడం ఖాయం అని విశ్లేషకుల అభిప్రాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: