ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిన్నరాత్రి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. సుమారు గంటసేపు కొనసాగిన ఈ ఇంటర్వ్యూలో పవన్ రాజకీయలగురించి మాత్రమే  కాకుండా తన కుటుంబ సభ్యుల గురించి తన రాజకీయ ఉద్దేశాల గురించి అనేక ఆసక్తికర  విషయాలను షేర్ చేసాడు. 

ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ఆమీడియా సంస్థ ప్రతినిధి మాటల మధ్య అలీ ప్రస్తావన తీసుకు వచ్చి అతడు ‘జనసేన’ లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీకేమి అనిపించలేదా ? అని అడిగిన ప్రశ్నకు పవన్ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. అలీ ఇప్పటికీ తన ప్రియమిత్రుడనీ అయితే అతడి రాజకీయ భవిష్యత్ తన పార్టీలో కంటే జగన్ పార్టీలో బాగుంటుందనీ భావించడమే కాకుండా తనకంటే జగన్ బలవంతుడు అని భావించి ఉంటాడు అంటూ నవ్వుతూ జోక్ చేసాడు పవన్.

ఇదే సందర్భంలో తనకు తన అన్న చిరంజీవి విషయంలో ఎదురైనా ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన రాజకీయ ఉద్దేశాలు వేరు చిరంజీవి రాజకీయ ఉద్దేశాలు వేరు అని అంటూ తన జనసేన కోసం తాను ఎప్పుడు చిరంజీవి సలహాలను అడగను అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనకంటే చిరంజీవి చాల గొప్ప నటుడు అనీ కేవలం తాను అనుకోకుండా పవర్ స్టార్ గా మారాను అంటూ కామెంట్స్ చేసాడు. 

ఇక సినిమా హీరోలు రాజకీయాలలోకి వచ్చినంత మాత్రాన వారిని చూడటానికి వచ్చే ప్రజలు అంతా ఓట్లు వేస్తారు అని అనుకోవడం అవివేకం అంటూ తన గురించి గోల చేస్తూ ఈలలు వేసే జనం తనకే ఓట్లు వేస్తారు అన్న పగటి కలలో తాను లేను అంటూ కామెంట్స్ చేసాడు. తాను చేస్తున్న ఎన్నికల వాగ్దానాలు అన్నీ ఎంత వరకు అమలు చేయగలడు అని వస్తున్న విమర్సల పై స్పందిస్తూ అవినీతిని నియంత్రించ గలిగితే తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు చాల సులువుగా అమలు చేయవచ్చు అని అభిప్రాయపడుతున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు పెన్షన్ ఇచ్చే ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ ఆలోచనల పై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ‘జనసేన’ కు ఎంతమంది రైతులు ఓట్లు వేస్తారో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: