ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం ఉత్తర భారత దేశంలో ఉన్నాడు. అయితే అతడు డైరెక్ట్ గా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండీ అని పిలుపు ఇవ్వకుండానే జూనియర్ ప్రస్తావనతో జరుగుతున్న క్లిపింగ్ ల రాజకీయ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

నిన్న మొన్నటి వరకు జూనియర్ ను దూరంగా పెట్టిన తెలుగుదేశం వర్గాలు జూనియర్ పేరును ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో చాల వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. జూనియర్ గొప్పతనం గురించి గతంలో అనేకమంది ప్రముఖులు చెప్పిన న్యూస్ క్లిపింగ్స్ ను ఇప్పుడు వెతికి పట్టుకుని వాటిని న్యూస్ గా మార్చి కొందరు వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేస్తున్న విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. 

నటన విషయంలో జూనియర్ గొప్పతనం గురించి కనిపించే ఆ న్యూస్ కింద భాగంలో ‘జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ సైకిల్ గుర్తుకే ఓటు వేయండీ’ అన్న స్లోగన్ పెడుతున్నారు. దీనితో ఈ స్లోగన్ జనం మధ్యకు వచ్చి జూనియర్ అనకపోయినా జూనియర్ ఈ స్లోగన్ ఇచ్చాడా అన్న భావన వచ్చే విధంగా ఈ న్యూస్ ను డిజైన్ చేస్తున్న కొన్ని గ్రూపులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తున్నాయి. 

అయితే ఈవిషయాలు అన్నీ జూనియర్ దృష్టి వరకు వెళ్ళినా ఆ పోస్టింగ్స్ తనకు సంబంధం లేదు అంటూ జూనియర్ ఎటువంటి ప్రకటన ఇవ్వడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో తన తాత పార్టీకి తన పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని మౌనంగా చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా భవిష్యత్ లో తన రాజకీయ వ్యూహాలకు ఈ ప్రచారం కలిసి వస్తుంది అని జూనియర్ భావిస్తున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: