మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మిగతా మెగా హీరోలకు పూర్తి భిన్నంగా తన కెరియర్ మలచుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్-2 ఇలా వరుస హిట్లతో కెరియర్ మంచి జోష్ లో కొనసాగిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తమిళ సినిమా జిగుర్తండా రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో వాల్మీకిగా వస్తున్న ఆ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు.


ఇక ఈ సినిమా కాకుండా కిరణ్ అనే డబ్యూ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తాడట. అందుకోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు ఈ మెగా హీరో. లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని మరి వరుణ్ తన కొత్త లుక్ ట్రై చేశాడు.


లేటెస్ట్ గా వరుణ్ తేజ్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన లుక్ తో వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ చేశాడని చెప్పొచ్చు. మెగా హీరోగా ఎంట్రీ అయితే దొరుకుతుంది కాని హిట్లు పడాలంటే మాత్రం టాలెంట్ చూపించాల్సిందే. అందుకే వరుణ్ తేజ్ కొత్త పంథాలో వెళ్తున్నాడు. సినిమా సినిమాకు వరుణ్ తేజ్ తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు.  


బాక్సింగ్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా త్వరలో మొదలు కానుందట. బాక్సింగ్ లో ఒలంపిక్స్ లో పాల్గొన్న టోనీ జెఫ్రీన్ తో రెండు నెలలు అద్భుతంగా గడిచింది తనని నేను చాలా మిస్ అవుతాను అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. మళ్లీ మరోసారి ట్రైనింగ్ లో కలుద్దాం అంటూ వరుణ్ తేజ్, జెఫ్రీన్ తో దిగిన పిక్ షేర్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: