బుల్లితెర మీద నవ్వుల జల్లులు కురిపిస్తున్న జబర్దస్త్ షో గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షోకి కంటెస్టంట్స్ మారితూ ఉంటారు కాని జడ్జులుగా మాత్రం నాగబాబు, రోజాలు షో మొదలైనప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వారిద్దరు ఆ షోని వీడుతున్నారట.


ఏపి ఎలక్షన్స్ లో వైసిపి అభ్యర్ధిగా రోజా.. జనసేన ఎంపి అభ్యర్ధిగా నాగబాబు ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ టైంలో కామెడీ షోల కన్నా ప్రజల్లో ప్రజలతో మమేకం కావాలని వారి ఆలోచన. ఏదో చుట్టం చూపుకి వచ్చి ఓ రోజు క్యాంపెయిన్ చేసి వెళ్తే సరిపోదు అందుకే నాగబాబు, రోజా వారు పోటీ చేస్తున్నా స్థానాల్లో విస్త్రుత స్థాయిలో ప్రచారాల్లో పాల్గొంటున్నారు.


ఇక వారానికి రెండు రోజులు షో.. అయితే ఒక్కరోజు షూట్ పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్న ప్రకారంగా తమ షెడ్యూల్ కుదరకపోవడంతో జబర్దస్త్ కు నాగబాబు, రోజా ఇద్దరు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారట. అయితే వారి స్థానంలో జడ్జులుగా ఎవరు వస్తారు. వారు ఎలా షోని నిలబెడతారు అన్నది చూడాలి.


జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అన్న విధంగా ఫిక్స్ అయ్యారు. మరి అలాంటిది ఇప్పుడు ఇద్దరు ఆ షోకి దూరమైతే కొత్త వాళ్లను ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. జబర్దస్త్ కొత్త జడ్జులుగా ఒకప్పటి హీరోయిన్ మీనాతో పాటుగా పోసానిని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఈసారి ఎలక్షన్స్ లో గెలిస్తే జబర్దస్త్ కు గుడ్ బై చెబుతానని రోజా అన్నది. నాగబాబు కూడా గెలిస్తే జబర్దస్త్ చేయడం కష్టమే అందుకే మల్లెమాల టీం వారిని రీప్లేస్ చేసే వారి కోసం వేట మొదలు పెట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: