చరణ్ జూనియర్ లు ప్రస్తుతం తెలుగు ప్రజలకు దూరంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి బందిఖానాలో గుజరాత్ లోఉన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఉదయమే రాజమౌళి సూచనల మేరకు షూటింగ్ కు రెడీ అయిపోతున్న వీరిద్దరి సరదాకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు లీక్ అయి ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. 

సాధారణంగా టాప్ హీరోలు షూటింగ్ స్పాట్ గ్యాప్ లో తమ కేర్వాన్ లో సమయం గడుపుతూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా చరణ్ తన కేర్వాన్ నుండి బయటకు వచ్చి షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోని వివిధ ప్రదేశాలను చూడాలని ఒక స్కూటర్ పై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జూనియర్ తాను కూడ ఆ స్కూటర్ పై వస్తాను అని అడుగుతున్న సందర్భానికి సంబంధించిన ఫోటోను వీరిద్దరిని దూరం నుంచి గుర్తు పట్టిన వ్యక్తులు క్లిక్ చేసారు. 

ఆ తరువాత వీరిద్దరూ రాజమౌళి షాట్ రెడీ పెట్టే లోపున స్కూటర్ పై ఒక ట్రిప్ వేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆవిశాయానికి సంబంధించిన ఫోటో లీక్ కావడంతో చరణ్ జూనియర్ అభిమానులు ఈ ఫోటో పై కామెంట్స్ పెడుతూ ‘రియల్ బ్రదర్స్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు వీరిద్దరి సాన్నిహిత్యం ఇలాగే కొనసాగాలి అంటూ కామెంట్స్ కూడ పెడుతున్నారు.

వీరిద్దరి మధ్య ఈ ప్రేమ ఉంది కాబట్టే ఆమధ్య జరిగిన మీడియా మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ ‘ఆర్ ఆర్ ఆర్’ లో చరణ్ జూనియర్ పాత్రలు తూకంలా సరిసమానంగా ఉండవనీ సీన్ ప్రాథాన్యత బట్టి మారిపోతూ ఉంటాయి అని లీకులు ఇచ్చాడు. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరి సాన్నిహిత్యం చరణ్ జూనియర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: