ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు కొనసాగుతుంది..అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాలు కొనసాగిస్తున్నారు.  నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలో అపశృతి చేసుకుంది.  ఈ మద్య బాలయ్య ప్రచారంలో పలు సంచలనాలు రేకెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన బాలయ్య తో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన టాలీవుడ్ సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు గాయపడ్డారు.

నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద బాలయ్య ప్రచారం చేస్తుండగా, ఆయన్ను కలిసేందుకు వెంకటేశ్వరరావు వెళ్లారు.  ఆ సమయంలో ప్రచార రథంలో బాలకృష్ణ ఉన్నారు..ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించిన వేళ, వాహనం ముందుకు కదిలింది.

దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్రగాయం అయింది. వెంటనే హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఆయనను తరలించగా, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: