తెలుగు ఇండస్ట్రీలో వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కొత్త హీరో కార్తికేయ, నూతన నటి పాయల్ రాజ్ పూత్ తో తీసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’బాక్సాఫీస్ షేక్ చేసింది.  ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదట విమర్శలపాలైనా..తర్వాత బోల్డ్ కంటేంట్, విఫరెంట్ కాన్సెప్ట్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.  దాంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లూ కూడా బాగానే వచ్చాయి.  ఈ చిత్రంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్ పూత్.

‘ఆర్ఎక్స్100’ సినిమాలో తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తించిన పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి ఐటెం సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  తేజ దర్శకత్వంలో బెల్లంకొడ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో సందడి చేస్తుంది పాయల్ రాజ్ పూత్.  తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

‘‘ఒంటేరు పాలకోవా.. నడకచూస్తే హంస నావా’’ అంటూ మొదలైన ఈ పాట ‘బుల్లెట్టు మీదొచ్చే బుల్రెడ్డి’ అంటూ హుషారెత్తిస్తోంది.  ఈ సాంగ్ లో పాయల్ హాట్ హాట్ అందాల సొగసులు ఆరబోసింది. ఈ ఐటెం సాంగ్‌తో థియేటర్లు గోల పెట్టడం ఖాయం అని చెప్పొచ్చు. డైరెక్టర్ తేజ మొత్తానికి ఈ చిత్రంలో కూడా యూత్‌కి కావాల్సినన్ని ఎలెమెంట్స్ పొందుపరిచారని స్పష్టంగా అర్థమవుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: