సాధారణ రాజకీయ నాయకులకు సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తాము అని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన  పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా పాద నమస్కారాలు స్థాయికి పడిపోవడం పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిన్న విశాఖపట్నం వచ్చిన మాయావతికి స్వాగతం పలుకుతూ పవన్ ఏకంగా ఆమె పాదాలకు నమస్కరించడం హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో పవన్ నరేంద్ర మోడీతో అదేవిధంగా అనేకమంది జాతీయ నాయకులతో సభలలో పాల్గొన్నా పవన్ ఎప్పుడూ ఇలా పాద నమస్కారాలు చేయలేదు. అయితే ఇప్పుడు పవన్ ఈ ట్విస్ట్ తీసుకోవడంతో పవన్ రాజకీయ భవిష్యత్ కు సంబంధించి అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలలో మాయావతికి పాద నమస్కారం చేయడం ద్వారా దళిత ఓటు బ్యాంక్ ను ఆకర్షించడానికి ఈ ఎత్తుగడ అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే పవన్ పోటీ చేస్తున్న గాజువాక భీమవరం స్థానాలలో పవన్ ను ఓడించడానికి 100 కోట్లుఖర్చు పెట్టె భారీ ప్రణాళిక రచించారు అంటూ పవన్ ఓపెన్ గా చెప్పిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాను అధికారంలోకి వస్తే లక్ష ఎకరాలు సేకరించి లక్ష మంది యువ రైతులను తయారు చేయడమే కాకుండా రైతులకు పెంక్షన్ ప్రకటించడం పవన్ ఎంచుకున్న కొత్త ఎత్తుగడగా మారింది. 

ఇక పవన్ కు మహిళల ఓట్లు పడవు అన్న కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో 'జనాసేన ఎలక్షన్ మ్యానిఫెస్టోలో పెట్టిన ఆడపడుచు కానుక హాట్ టాపిక్ గా మారింది. ప్రతి సంక్రంతి పండుగకు కులం మతంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతి మహిళ బ్యాంక్ ఎకౌంట్ కు 10,001 రూపాయలు బహుమతిగా ఇస్తాను అంటూ పవన్ ఇస్తున్న వాగ్దానాలు ఎంతవరకు మహిళల ఓట్లు జనసేనకు పడేలా చేస్తాయి అన్న అంచనాలు ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: