సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మహర్షి'. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే దాదాపు 100 కోట్ల బిజినేస్ జరిగిందని ఇండస్ట్రీ టాక్. అంతేకాదు శాటిలైట్‌తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీగా జరిగాయట. అయితే ఈ బిజినెస్ అంతా కూడా మహేష్ కున్న క్రేజ్ వల్లే అయింది కానీ డైరెక్టర్ వల్ల ఏమాత్రం కాదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారట.


అందుకు కారణం కూడా లేకపోలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటివరకు తీసింది కేవలం 4 సినిమాలే. అందులో తన మొదటి సినిమా 'మున్నా'. 2007 లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో వంశీ కి మళ్ళీ సినిమా ఛాన్స్ రావడానికి దాదాపు మూడేళ్ళు పట్టింది. ఆతర్వాత వచ్చిన 'బృందావనం', 'ఎవడు' యావరేజ్ కాగా 'ఊపిరి' మాత్రం కమర్షియల్‌గా సక్సస్ ని అందుకుంది. అయితే ఈ నాలుగు సినిమాలలో ఒక్కటి కూడా వంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కాదనే చెప్పాలి.


ఈ ఎఫెక్టే ఇప్పుడు మహేష్ 'మహర్షి' మీద బాగా పడిందని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఇప్పటివరకు 'మహర్షి' ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అవలేదట. 'భరత్ అనే నేను' ఓవర్సీస్ లో భారీగా బిజినెస్ అయిన సంగతి తెలిసిందే. అందుకు మేయిన్ రీజన్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ అనే చెప్పాలి.  కానీ వంశీ కి డైరెక్టర్ గా కంటిన్యూ హిట్స్ లేకపోవడం, మహేష్ కి ఓవర్సీస్ లో అంతగా మార్కెట్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ముందుకు రాకపోవడం వల్ల ఇంకా ఓవర్సీస్ లో బిజినెస్ డీల్ క్లోజ్ అవలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: