టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 సినిమా తర్వాత హీరో ప్రభాస్ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’సినిమాలో నటిస్తున్నాడు.  బాహుబలి తర్వాత ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ లభించిన విషయం తెలిసిందే.  అందుకే ఆయన సినిమాలు పలు భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్దం అవుతున్నారు చిత్ర యూనిట్.  అంతే కాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా కూడా చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు.  ఈ సినిమాలు పలువురు బాలీవుడ్ తారలు కూడా నటిస్తున్నారు. 
Related image
ఈ  సినిమాల కోసం దేశ విదేశాల‌కి చెందిన సినిమా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.   స్పై థ్రిల్ల‌ర్‌గా ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నాడు.  యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోస్పెష‌ల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారట సాహో టీం.  పాప్ గాయ‌నిగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన బ్రిటీష్ భామ కైలీ మినోగ్‌.. సాహోలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా సమాచారం. 

గత పది సంవత్సరాల క్రితం కైలీ మినోగ్‌  బాలీవుడ్ హీరో అక్షయ్ నటించిన ‘బ్లూ’సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమాలో  నీల్‌ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్ర‌ద్ధా క‌పూర్  న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి విడుద‌లైన వీడియోలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: