బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా తీసిన రాజమౌళి మరోసారి అదే తరహాలో మల్టీస్టార్ మూవీ తీస్తున్నారు.  ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.  1920 నాటి మహావీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు రాజమౌళి తెలిపారు.  ఈ సినిమా మొన్నటి వరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ పూనేల్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అప్ డేట్స్ కూడా చిత్ర యూనిట్ ఇచ్చారు.

అంతే కాదు నిన్న రాంచరణ్ లో ఎన్టీఆర్ స్కూటీపై తీసుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ సన్నివేశంలో రాంచరణ్ కి గాయాలు అయినాయట..దాంతో  షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ ఇచ్చారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . మాములుగా అయితే పూణే లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ జరగాలి కానీ రాంచరణ్ కాలికి గాయం కావడంతో సరిగ్గా నడవాలన్నా , పరుగెత్తాలన్నా కూడా కష్టమే దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రెండు షెడ్యూళ్ల ని హైదరాబాద్ లో పూర్తిచేసుకుంది . అయితే మూడో షెడ్యూల్ ని పూణే లో ప్లాన్ చేయగా అది ఇలా బెడిసి కొట్టింది దాంతో ప్యాకప్ చెప్పారు . ఈ సినిమా దానయ్య రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఈ మూవీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్, నటి ఆలియభట్, హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: