ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.  ఈ నేపథ్యంలో తెలంగాణ పోరాట యోధుడు, ప్రస్తుతం సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఉద్యమ సింహం’చిత్రాన్ని తీశారు.  ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతున్న సమయంలో కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి..దాంతో ఈ చిత్రం రిలీజ్ ఆగిపోయింది. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కోడ్ అమలు అవుతుంది.   ఈ సమయంలో ఉద్యమ సింహం సినిమాని రిలీజ్ చేయడం వల్ల ఆంధ్రా ఓటర్లని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. 

అంతే కాదు కేసీఆర్ కు ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్నికల సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పారట.  దాంతో కొన్ని రోజుల వరకు కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం రిలీజ్ ని నిలిపివేశారట. ఎన్నికల తర్వాత నైనా రిలీజ్ అవుతుందా ? లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: