రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం పూణేలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న ఉదయం చరణ్ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండగా అతడికి అనుకోకుండా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పూణేలో జరగవలసిన షెడ్యూల్ ను నిలిపివేసి ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ అంతా తిరిగి వస్తున్నట్లు సమాచారం. 

చరణ్ ను పరీక్షించిన వైద్యులు మూడు వారాలు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కేవలం మేలో మాత్రమే ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. గుజరాత్ లోని వడోదరలో చరణ్ జూనియర్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత ఈమూవీ యూనిట్ పూణే వచ్చిన వెంటనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

గతంలో ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో కూడ ప్రభాస్ కు గుర్రం పై నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ కొనసాగుతూ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ సందర్భంలో చరణ్ కు గాయాలు అవ్వడంతో రాజమౌళి సినిమాలలో నటించే హీరోలు అంతా ఏదో సందర్భంలో గాయాలను కూడ ఎదుర్కోవాలి అన్న సెంటిమెంట్ కొనసాగుతోంది అనుకోవాలి.

రాజమౌళి ఎన్నికలకు జూనియర్ చరణ్ లను దూరంగా ఉంచడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఈభారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు అని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు జూనియర్ చరణ్ లు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్న నేపధ్యంలో వచ్చే వారం జరగబోతున్న ఎన్నికలలో వీరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై మీడియా అడిగే ప్రశ్నలకు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికర విషయం..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: