పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలలో పోటీ చేస్తున్న పరిస్థుతులలో పవన్ ఈ రెండు నియోజక వర్గాలలో ఏస్థానం నుండి ఖచ్చితంగా గెలుస్తాడు అన్న అంచనాలు పందాలు హోరెత్తిపోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ గాజువాకలో తీసుకున్న అద్దె ఇంటి కష్టాలు హాట్ న్యూస్ గా మారాయి.

పవన్ సామాజిక వర్గం ఓట్లు గాజువాకలో చాల ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడ పవన్ గెలుపు ఖాయం అన్న అంచనాలతో పవన్ ఎన్నికల బరిలోకి దిగాడు. అయితే పవర్ స్టార్ స్థానికుడు అవ్వకపోవడంతో అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే అతడు ప్రజలకు ఏమిచేయగలుగుతాడు అన్న ప్రచారం పవన్ వ్యతిరేకులు ప్రారంభించారు.

దీనితో షాక్ అయిన పవన్ గాజువాక ప్రజల నమ్మకం పొందడం కోసం అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తాను అక్కడే ఉంటాను అంటూ బహిరంగ ప్రకటన కూడ చేసాడు. అయితే గాజువాకలో పవర్ స్టార్ కు అద్దె ఇల్లు అంత సులువుగా లభించలేదు అని టాక్. సాధారణంగా ఒక ఇంటిని అద్దెకు ఇచ్చేడప్పుడు రెండు నెలల అడ్వాన్స్ తీసుకుంటారు. 

అయితే పవన్ కు ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని ఏకంగా నెలకు 75వేలు అద్దె చప్పున 6నెలల అడ్వాన్స్ ముందుగా పుచ్చుకున్న విషయం షాకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పుడు ఈవార్త వైరల్ కావడంతో పవన్ ను నమ్మి అద్దె ఇల్లు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేసిన గాజువాక ప్రజలు పవన్ గాజువాక సమస్యల పై 64 అంశాల ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా ఎంత వరకు గాజువాక ప్రజలు పవన్ కు ఓటు వేస్తారు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: