సంక్రాంతి వచ్చింది అంటే పండుగ శోభతో పాటుగా కన్నుల పండుగ వచ్చేసినట్టే. అదేనండి సినిమాల పండుగ వచ్చినట్టే కదా.. కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలవగా వారి ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు సినిమాలు వస్తాయి. 2020 సంక్రాంతి బరిలో ఏయే సినిమాలు పోటీ పడుతున్నాయి.. ఏ హీరోలు తమ ఫ్యాన్స్ నే కాదు సిని ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారో ఇప్పుడు చూద్దాం.


పొంగల్ వార్ లో మొదట వినపడుతున్న పేరు ప్రభాస్, రాధాకృష్ణ ఫేమ్ జాన్ సినిమా. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టిన ఈ సినిమా 2020 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. సాహో ఈ ఇయర్ ఆగష్టు 15కి వస్తుండగా జాన్ సినిమా పొంగల్ వార్ లో దిగుతుందని టాక్. అయితే 6 నెలల్లో ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడా ఇది జరిగే పనేనా అనే డౌట్ లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.


ఇక 2020 పొంగల్ రేసులో సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి సినిమా ఉంటుందని తెలుస్తుంది. మే 9న మహర్షి రిలీజ్ అవుతుండగా జూన్ నుండి అనీల్ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు మహేష్. సో అది సంక్రాంతికి రిలీజ్ చేసేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా కూడా ఈ ఇయర్ చివర్లో రిలీజ్ అంటున్నా అది సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చు. 


ఇదే కాకుండా సైరా సినిమాను కూడా దసరాకి రిలీజ్ అని చెబుతున్నా అది కూడా 2020 సంక్రాంతికి వస్తుందని అంచనా. మరోపక్క బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ తో వస్తుందట. అసలే బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అవుతుంది. మరి 2020 పొంగల్ వార్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: