రేపు విడుదల కాబోతున్న ‘మజిలీ’ మూవీ చైతన్య కెరియర్ కు అత్యంత కీలకం కావడంతో ఈమూవీ విడుదల సందర్భంగా నిన్న చైతూ మీడియా మీట్ నిర్వహించాడు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు చైతన్య చాల ఓపికగా సమాధానం ఇచ్చాడు. 

ఇలాంటి సందర్భంలో చైతన్య ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘మజిలీ’ కథ విన్న తరువాత తనకు ఎంతగానో నచ్చి తాను ఆ సినిమాలో నటించదానికి అంగీకరించిన విషయాలను గుర్తు చేసుకుంటూ సమంత ఇమేజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈమూవీలో హీరోయిన్ గా సమంత బదులు వేరే హీరోయిన్ ని పెట్టమని తాను దర్శకుడు శివ నిర్వాణతో చాలారోజులు యుద్ధం చేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

వాస్తవానికి ఈసినిమాలో తనకు సమంతతో నటించే ఆలోచన లేదనీ అయితే దర్శకుడు ఆపాత్ర సమంత తప్ప మరెవ్వరూ చేయలేరు అని చెప్పడంతో తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా సమంతతో తాను నటించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు చైతూ. అయితే మూవీ పూర్తి అయ్యాక ఫైనల్ కాపీ చూసిన తనకు ‘మజిలీ’ లో ఆపాత్ర సమంత మాత్రమే చేయగలుగుతుంది అన్న అభిప్రాయం కలిగింది అనీ కామెంట్స్ చేసాడు. 

దీనితో ఆమీడియా సామావేసానికి వచ్చిన మీడియా ప్రతినిధులు చైతూ మాటలకు వేరే అర్ధాలు వెతుకుతున్నారు. ‘మజిలీ’ సినిమాకు జరిగిన భారీ బిజినెస్ సమంత క్రేజ్ బట్టి జరిగింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో దానికి నెగిటివ్ గా ఇలా చైతన్య వ్యూహాత్మకంగా తాను సమంత ఇమేజ్ పై ఆధారపడటం లేదు అన్న సంకేతాలు ఇచ్చి ఉంటాడు అంటూ మీడియా ప్రతినిధులు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: