తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రం 1920 కాలాం నాటి పరిస్థితులు ఆ సమయంలో బ్రిటీష్ వారిని గడ గడలాడించిన పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవిత విషేషాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట. మొన్నటి వరకు  ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగింది.  తదుపరి షెడ్యూల్ కోసం పూనే వెళ్లారు. 

కానీ అక్కడ రాంచరణ్ కాలికి గాయం కావడంతో  చెర్రీ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పూణేలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ కూడా వాయిదా పడింది. తాజాగా తనకు  తగిలిన గాయంపై చెర్రీ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు నేను వర్కవుట్ చేస్తుండగా నా యాంకెల్‌కు దెబ్బ తగిలింది.

ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైద్యులు కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోమని నాకు సూచించారు. మూడు వారాల్లో మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటా’’ అని చెర్రీ పోస్ట్ పెట్టాడు.  ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం అటు నందమూరి ఇటు మెగా ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: