‘వినయ విధేయ రామ’ సూపర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు టాప్ హీరోల సినిమాలు అంటే తెగ భయపడిపోతున్నారు. దీనితో టాప్ హీరోల సినిమాల పై ఎన్ని పాజిటివ్ వార్తల లీకులు వచ్చినా బయ్యర్లు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ బయ్యర్లు టాప్ హీరోల సినిమాల విషయంలో ఏమాత్రం అత్యుత్సాహం ప్రదర్శించడం లేదు.

ఇలాంటి పరిస్థుతులలో గత సంవత్సరం ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ అయినప్పటికీ ‘మహర్షి’ మూవీ మార్కెట్ కు ఓవర్సీస్ లో ఎదురౌతున్న ఎదురీత ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గత సంవత్సరం విడుదలైన ‘భరత్ అనే నేను’ ఓవర్సీస్ లో 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినా ఆమూవీని విడుదల చేసిన ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు రాలేదని వార్తలు వచ్చాయి. 

అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో బయ్యర్లకు కూడ ‘భరత్ అనే నేను’ నష్టాలు మిగిలించింది అన్న మాటలు వినిపించాయి. ఈ అనుభవాలతో ‘మహర్షి’ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బయ్యర్లు తాము ఈసినిమాను కేవలం షేరింగ్ బిజినెస్ మాత్రమే విడుదల చేస్తాము కాని ‘మహర్షి’ నిర్మాతలు అడుగుతున్న భారీ రెట్లు తాము ఇవ్వలేము అని చెపుతున్నట్లు టాక్. 

ఇదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లలో కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. దీనితో ‘మహర్షి’ మూవీని తాము అనుకున్న రేట్లకు తగ్గించి అమ్మాలా లేకుంటే ఈసినిమా విడుదల సమయం దగ్గర పడేవరకు వేచి ఉండి ఈమూవీ పై మ్యానియా ఏర్పడిన తరువాత భారీ బిజినెస్ చేయాల అన్న రకరకాల ఆలోచనలలో ‘మహర్షి’ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ‘మహర్షి’ మూవీలోని మొదటి పాట పెద్దగా క్లిక్ అవ్వకపోవడం ఈమూవీ మార్కెట్ కు ప్రతిబంధకంగా మారింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: