టాలీవుడ్ లో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన అలీ తర్వాత స్టార్ కమెడియన్ గా మారిపోయారు.  ఆయన ఎంతో మంది హీరోలకు స్నేహితుడిగా నటించి నవ్వులు పూయించారు.   కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా..ఎక్కువ కమెడియన్ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చారు.  వెండి తెరపైనే కాదు ఆలీ బుల్లి తెరపై కూడా తన సత్తా చాటుతున్నారు.  ప్రస్తుతం రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న ఆయన ఇటీవల వైసీపీ పార్టీలో చేరారు.  అయితే టాలీవుడ్ లో ఆలీ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ మంచి స్నేహితులు అంటారు.  వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

గతంలో అలీ జనసేన పార్టీలో చేరుతారని వార్తలు కూడా వచ్చాయి.  అయితే వైసీపీలో చేరిన అలీ స్నేహం వేరు..రాజకీయం వేరు అని అన్నారు.  తాజాగా  జనసేన   అధినేత పవన్ కళ్యాణ్ తన అత్యంత ఆప్తమిత్రుడు, వైసీపీ నేత, కమెడియన్ అలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..యాక్టర్లు, పాపులారిటీ రెండూ వేర్వేరు అంటూ చెప్పుకొచ్చారు. సినీ నేపథ్యంలో పాపులారిటీ ఉన్నవారికి జనం ఎక్కడికి వెళ్లినా హర్షద్వానాలతో స్వాగతం పలుకుతారు.    ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని హితవు పలికారు.తనకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారని వాటిని తాను నమ్మదలచుకోలేదన్నారు.

తన మిత్రుడు అలీకి ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు.  పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమాల్లో అలీ ఉండాల్సిందే..కానీ రాజకీయాల్లో ఆయన తన వెండాల్సిన అవసరం లేదని అన్నారు.  వైసీపీలో చేరిన అలీ ఒకానొక సందర్భంలో మగ మథర్ థెరిస్సా ఉంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరేనని ప్రశంసించారు. ఆయనలాంటి సేవాగుణం కలిగిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి ఎవరూ లేకపోవచ్చంటూ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.  తాజాగా అలీపై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: